ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం శ్రీ సువర్చలా హనుమద్ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో పంచామృత అభిషేకం, అనంతరం హనుమద్ కళ్యాణాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.1,60,170 ఆదాయం సమకూరిందని, 1,540 మంది భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించినట్లు ఆలయ EO. చందన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో సువర్చలా హనుమద్ కళ్యాణం


