NTR: ఏ కొండూరు చైతన్యనగర్ తండాలోని ఆశ్రమ బాలుర పాఠశాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, వసతి గదులు, భోజన సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, చదువుకు సంబంధించిన సౌకర్యాలపై ఆరా తీశారు. వసతుల కొరత ఉంటే అధికారులకు తెలపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రమ పాఠశాలలో సౌకర్యాలపై సీపీఎం నేత ఆరా


