విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 4 ఏళ్ల బాలిక శివపార్వతి అపహరణ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.30 వేలకు బాలికను విక్రయించేందుకు నిందితులు ఒప్పందం చేసుకున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి శనివారం వెల్లడించారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన స్కూటీ, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలిక అపహరణ.. ముగ్గురు అరెస్ట్


