హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు కురవాలని అంజన్నకు ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలం రామస్వామిపల్లె సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆకు పూజ, పంచామృత అభిషేకాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసి కోలాటాలు నిర్వహించారు.