WG: మొగల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.రవిబాబు శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
PHCని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి


