హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'50 ఏళ్ల అవసరాలకు సరిపడే క్రీడా మౌలిక వసతులు'

అన్నమయ్య: రాష్ట్రంలో రాబోయే 50 ఏళ్ల అవసరాలకు సరిపడే క్రీడా మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, నెల్లూరు పరిసరాల్లో 1,000 ఎకరాల్లో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.