హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సులో నగదు చోరీ

KDP: అట్లూరు మండలం ఆకుతోటపల్లెకు చెందిన అరవ శారదమ్మ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా రూ.1.10 లక్షలు చోరీకి గురయ్యాయి. బంగారం విడిపించేందుకు బ్యాగులో రూ.3 లక్షలు తీసుకుని భర్తతో కలిసి బద్వేల్‌కు బయలుదేరిన ఆమెకు అట్లూరు క్రాస్‌ రోడ్డు నుంచి బద్వేల్ బస్టాండ్ చేరుకునేలోపే డబ్బు మాయమైనట్లు గుర్తించారు. బాధితులు బద్వేల్ అర్బన్ పోలీసులను ఆశ్రయించారు.