హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.64.49 లక్షల CMRF చెక్కుల పంపిణీ

BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు రూ.64,49,768 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శనివారం అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,142 మందికి రూ.10.47 కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అండగా నిలుస్తోందన్నారు.