హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బజ్జీలు తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థత

E.G: కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి హాస్టల్లో శుక్రవారం కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారంగా పెట్టిన బజ్జీలు తిన్న కాసేపటికే వారికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.