హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో 'తెలుగు భాషా దినోత్సవం' వేడుకలు

ATP: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ హాజరయ్యారు. అనంతరం గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.