హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే

సత్యసాయి: ​కదిరి కుటాగుల్లలోని బ్లూమూన్ విద్యాసంస్థల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా స్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.