హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు భాషా పితామహుడు గిడుగు: ఎమ్మెల్యే

E.G: తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.