హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో అభివృధ్ధి పనులు: ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద రూ. 77.35 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజి పథకానికి MLA జేసీ అస్మిత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. పట్టణానికి 24 గంటల మంచినీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.