VSP: పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఆరిలోవ అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. జిల్లా సమితి కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి'


