AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్‌లో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పద్యాలు, వ్యాసరచన, పాటలు, ఏకపాత్రాభినయం, కవితలు, విచిత్ర వేషధారణ తదితర పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రతాప్‌కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


