NTR: ఈవీఎం, వీవీప్యాట్ గోదాముల భద్రత విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఇవాళ గొల్లపూడిలోని గోదామును తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేసి, రిజిస్టర్లో సంతకం చేశారు. భద్రతా చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం భద్రతపై కలెక్టర్ సమీక్ష


