హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మాతృభాషా దినోత్సవం

SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు మాతృభాషా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ చింతాడ శరత్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గిడుగు తెలుగు భాషకు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.