SKLM: రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు ఉద్దానం అభ్యుదయ సేవా సమితి రూ.7,000 సాయం శనివారం అందించింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యమని వ్యవస్థాపకులు లక్ష్మణరావు తెలిపారు. సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్‌లు విజయ్, మహేష్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడికి ఆర్థిక సాయం


