హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరిత రాయబారుల జీతాలు చెల్లించాలని వినతి

VZM: దత్తిరాజేరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో హరిత రాయబారుల బకాయిల జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ శనివారం ఎంపీడీవో తాతకు వినతిపత్రాన్ని అందజేశారు. నెలల తరబడి జీతాల బకాయిలు ఉంటే కుటుంబాల్ని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.