హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేర రహిత వికారాబాద్‌కు సహకరించాలి: వైస్ ఛైర్మన్

VKB: నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్థ సుధాకర్‌రెడ్డి కోరారు. వికారాబాద్ పట్టణంలోని సీసీ కెమెరాల మరమ్మతుల కోసం రూ.2 లక్షల చెక్కును అందజేశారు. నేరాల నియంత్రణలో తనవంతు బాధ్యతగా ఈ సాయం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించి నేర రహిత వికారాబాద్‌కు సహకరించాలన్నారు.