NRML: మండలంలోని మున్యాల్ నుంచి రేవోజీపేట గ్రామాల మధ్యలో పాండ్వాపూర్- కలమడుగు రహదారి పైకి చెట్ల కొమ్మలు కమ్ముకున్నాయి. రోడ్డు పైకి కొమ్మలు రావడంతో ఎదురుగా బస్సు,లారీల వంటి వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
'రోడ్డు పైకి వచ్చిన కొమ్మలను తొలగించండి'


