హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలి: మాల మహానాడు

MDK: విద్య, ఉద్యోగ రంగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తలపెట్టిన ‘చలో సచివాలయం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు మెదక్ జిల్లా కమిటీ కోరింది. శనివారం తూప్రాన్‌లో ఈ మేరకు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. మాలల హక్కులను కాలరాస్తున్న రోస్టర్ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.