హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి భీం రావు

ASF: జిల్లా కేంద్రంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కోట్నక్ భీం రావు వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట్నక్ భీం రావు గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.