నల్గొండ ఆర్టీసీ బస్టాండ్–పెద్ద గడియారం మార్గంలోని అంబేద్కర్ భవనం మూలమలుపు వద్ద గేట్ వాల్వ్ గుంత తెరిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రహదారి అంచున డ్రైనేజీ పక్కనే ఉన్న ఈ గుంతకు మూత లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు వెంటనే స్పందించి గుంతకు మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
తెరిచి ఉన్న గేట్ వాల్వ్ గుంత


