BDK: మణుగూరు మండలం గుట్టమల్లారం ప్రాంతంలో ఇసుక రీచ్ గుత్తేదారులు లారీలతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, తరలింపులు చేపడుతున్నారని మాజీ జెడ్పీటీసీ పోశం నరసింహారావు ఆరోపించారు. తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం రెవెన్యూ కార్యాలయంలో డీటీ రామారావుకు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ గ్రావెల్ తవ్వకాలు నిలిపివేయాలి: బీఆర్‌ఎస్


