హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమయానికి బస్సులు నడిచేలా ఏర్పాటు చేయండి'

అలంపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో శనివారం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా అలంపూర్ నుండి కర్నూలు‌కి వెళ్లడంతో పాటు జోగులాంబ ఆలయాలను దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు, యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. ప్రజలతో పాటు భక్తుల సౌకర్యార్థం సమయానుకూలంగా బస్సులు నడిచేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.