హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ADB: ఉట్నూర్ మండలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా ర్యాలీని ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించి, విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.