హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రంలోనే కామారెడ్డిలో అధిక వర్షపాతం

KMR: జిల్లాలో ఆగస్టు 29 వరకు రాష్ట్రంలోనే అధిక వర్షపాతం నమోదైనట్లు TGDPS అధికారులు వెల్లడించారు. 14 మండలాల్లో అధిక వర్షపాతం, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సరాసరి 613.5 మిమీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 737.5 మిమీల వర్షపాతం నమోదై 20% అధిక ధనాత్మక వర్షపాత వ్యత్యాసం రికార్డయ్యిందన్నారు.