WGL: ఖానాపురం మండలం మర్నాగి బోడుతండా ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో గ్రామస్థులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వి మట్టిని వేయడంతో గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలుస్తోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
రోడ్డుపై వరి నాటు వేసి నిరసన


