హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణ శనివారం.. భద్రకాళి ఆలయంలో విశేష పూజలు

WGL: శ్రావణమాస శనివారం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులు తెల్లవారుజామున విశేషాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నూతన వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.