హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి, పత్తి పంటల జోరు.. క్రాప్ సర్వే షురూ

BHNG: జిల్లాలో 2026 ఖరీఫ్ సాగు వేగంగా పుంజుకుంటోంది. జూలై చివరి నాటికి జిల్లాలోని 4,24,319 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 2,42,931 ఎకరాల్లో (57.3%) సాగు పూర్తయింది. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం రెట్టింపై, రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానంగా వరితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు విస్తారంగా సాగవుతుండగా.. ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను కూడా ప్రారంభించింది.