హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లు..!

ఖమ్మం జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3,095 మంది విద్యార్థులకు నీలి రంగు చొక్కా, బ్లూ ప్యాంట్లను అందజేయనున్నారు. ఇప్పటికే బట్టలు జిల్లాకు చేరుకున్నాయని, మహిళా సంఘాల ద్వారా వీటిని కుట్టించి త్వరలోనే పంపిణీ చేస్తామని డీఐఈఓ రవిబాబు తెలిపారు.