BDK: అశ్వారావుపేటలో మద్యం విక్రయాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణ, కొన్ని బ్రాండ్లకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అశ్వారావుపేటలో మద్యం ధరలపై ఆరోపణలు


