హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేముల్‌నర్వలో బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు

RR: కేశంపేట్ మండలం వేముల్‌నర్వలో బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 3న మైసమ్మ, పోచమ్మ బోనాలు, 4న ఈదమ్మ బోనాలు నిర్వహించనున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరపనున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.