హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వైరా జూనియర్ కళాశాలలో ఆర్చరీ ఎంపికలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపికలు ఆదివారం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనున్నాయి. ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని అసోసియేషన్ ప్రతినిధులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలిపారు. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.