హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైరాలో రేపు ఆర్చరీ ఎంపికలు

KMM: వైరా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 30న జూనియర్‌ బాలబాలికల జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఇండియన్‌ రౌండ్‌, రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో ఎంపికలు ఉంటాయి. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు. క్రీడాకారులు ఏఏఐ చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డు తీసుకురావాలని సూచించారు.