హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. ఐదుగురికి గాయాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి వైపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.