హైదరాబాద్: 28°C
తెలంగాణ

రమణక్కపేటలో భూ రీసర్వే పనులు ప్రారంభం

MLG: మంగపేట మండలం రమణక్కపేటలో రైతులకు భూకార్డులు పంపిణీ చేసేందుకు చేపట్టిన రీసర్వేలో భాగంగా శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు. అనంతరం పట్టా, ప్రభుత్వ, అటవీ, రెవెన్యూ భూములను గుర్తించనున్నట్లు తహసీల్దార్ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ ఏసుపాదం, జీపీవో కన్నయ్య, సర్వేయర్ సఫియా, రైతులు పాల్గొన్నారు.