హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ వ్యవసాయ సాగు వివరాలు.!

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 12,02,051 ఎకరాల లక్ష్యానికి గానూ ఆగస్టు చివరి నాటికి 10,72,311 ఎకరాల్లో (89%) సాగు నమోదైంది. నీటి కొరతతో వరి 4.38 లక్షల ఎకరాలకే పరిమితం కాగా, వర్షాధారంగా పత్తి అత్యధికంగా 6.02 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది, పెసర, ఇతర ఆరుతడి పంటలు మొత్తం కలిపి సుమారు 57,704 ఎకరాల్లో సాగయ్యాయి.