హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షాబంధన్ వేళ.. తీరని శోకం!

SDPT: దుబ్బాకకు చెందిన పడకంటి స్రవంతి(28) రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి తండ్రి, సోదరుడికి రాఖీ కట్టింది. శుక్రవారం రాత్రి తిరిగి వచ్చి దుబ్బాక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గట్టుపై ఉన్న బ్యాగు, ఫోన్ చూసి స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతురాలికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.