హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమరవీరుల త్యాగ ఫలితమే ఉచిత విద్యుత్'

MHBD: బషీర్ బాగ్ విద్యుత్ అమరవీరుల 26వ వర్ధంతి సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అమరవీరుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ.. నేటి ఉచిత విద్యుత్ నాటి బషీర్బాగ్ అమరవీరుల పోరాటం ఫలితమేనని అన్నారు.