హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: మధిర పట్టణంలోని నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. రైల్వే గేట్ నుంచి లడక్ బజార్ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.