MBNR: జడ్చర్ల విజయనగర్ కాలనీలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. బోనాల పండుగకు కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లిన రామకృష్ణ ఇంట్లో గురువారం తెల్లవారుజామున రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటనపై శుక్రవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బోనాలకు ఊరెళ్లగా.. ఇంట్లో దొంగల దోపిడీ


