హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

KMR: బ్యాన్స్ వాడ మండలం తిర్మలాపూర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను నేటి నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రానున్నట్లు చెప్పారు. ఆదివారం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.