హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తెలంగాణ హమాలి యూనియన్ జిల్లా సదస్సు

NZB: నేడు నిర్వహించనున్న తెలంగాణ హమాలి & మిల్ వర్కర్ యూనియన్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.