హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు

VKB: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించింది. ప్రభుత్వం పలు సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. వికారాబాద్ పరిధిలో దాదాపు 353, తాండూరులో 655 సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నిషేధంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.