హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఒడ్డున మహిళ మృతదేహం లభ్యం

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలో గోదావరి ఒడ్డున మహిళ మృతదేహం శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. క్షత్రియ కళ్యాణ మండపం సమీపంలో గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు వయసు 40 ఏళ్లకు పైగా ఉంటుందని, చీర ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.