హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేప కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌!

విశాఖ తీరంలో లభించే నెత్తళ్లు, సావిడాయి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. ప్రొఫెసర్ మంజులత నేతృత్వంలో జి.చంద్రిక చేసిన ఈ రీసెర్చ్ వివరాలు అంతర్జాతీయ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. చేపల జీర్ణాశయం, మొప్పలతో పాటు కణజాలంలోనూ 0.5 నుంచి 4.5 మి.మీ పరిమాణంలో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు.