హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెల్లెలి మృతిని తట్టుకోలేక అన్న ఆత్మహత్య

BHPL: మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పి.పి)లో చెల్లెలి మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన చిన్నమల్లయ్య (55) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెల్లెలు జంగిలి గట్టమ్మ అనారోగ్యంతో పది రోజుల క్రితం మృతి చెందడంతో తీవ్రంగా కుంగిపోయిన చిన్నమల్లయ్య గురువారం పురుగుమందు తాగాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.