హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ ఇదే.!

WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి ఆలయంలో శ్రావణమాసం వేడుకలు ఘనంగా, వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మూడో శనివారం సందర్భంగా తల్లికి అర్చకులు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. వారాంతం కావడంతో తల్లిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.